అఖండ భారత్ విభజన - దేశ చరిత్రలో మరువలేని గాయం ~ Ajay Kumar, Trikaal Voice

1947 ఆగస్టు 15 పాఠ్య పుస్తకాలలో మనకు “స్వాతంత్ర్యం లభించిన రోజు” గా నేర్పబడింది.

కానీ అదే ఒక రోజు ముందు 14 ఆగస్టు 1947న , మన నాగరికత గుండెల్లో ఒక గాయం పడ్డది.

అది అఖండ భారత్ విభజన.

ఈ విభజన కేవలం భూభాగం కోల్పోవడం కాదు, శతాబ్దాలుగా హిందూ సంస్కృతి పరిమళం వెదజల్లిన భూమిని ముక్కలు చేయడం.



1. బ్రిటిష్ కుట్రలకు ఆరంభం - 1857 తర్వాత


1857లో స్వతంత్ర సంగ్రామం బ్రిటిష్‌కు ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది.

హిందువులు మరియు ముస్లింలు ఐక్యంగా పోరాడితే, బ్రిటిష్ రాజ్యం నిలవదు.

అప్పటినుంచి బ్రిటిష్ పాలకులు Divide and Rule అనే దుర్నీతి విధానాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేశారు.


1905 బెంగాల్ విభజన - మతాధారంగా ప్రాంతాల విభజన మొదటి ప్రయోగం.


1909 మోర్లే-మింటో సంస్కరణలు - ముస్లింలకు ప్రత్యేక ఓటు హక్కులు. ఇది హిందూ - ముస్లిం రాజకీయ విభజనకు నాంది పలికింది.


మత కోటాలు - సైన్యం, సివిల్ సర్వీస్, విద్యా వ్యవస్థలో మత ఆధారంగా స్థానాలు.


ముస్లిం ప్రోత్సాహక విధానాలు - హిందువుల ప్రభావాన్ని తగ్గించేలా పరిపాలన.


2. ముస్లిం లీగ్ పుట్టుక & జిన్నా మార్పు:


1906లో ధాకాలో ముస్లిం లీగ్ ఏర్పాటైంది.

ప్రారంభంలో "ముస్లింల హక్కుల పరిరక్షణ" పేరిట వచ్చినా, త్వరలోనే అది హిందూ వ్యతిరేక రాజకీయ వేదికగా మారింది.


జిన్నా - ఒకప్పుడు “హిందూ - ముస్లిం ఐక్యత” కోరిన న్యాయవాది, తర్వాత బ్రిటిష్ ప్రేరేపణ, రాజకీయ స్వార్థం, మరియు మతం పేరుతో హిందువుల శత్రువుగా మారాడు.


1940 లాహోర్ తీర్మానం - ముస్లిం మెజారిటీ ప్రాంతాలకు ప్రత్యేక దేశం డిమాండ్. ఇది పాకిస్తాన్ బ్లూప్రింట్.


Direct Action Day (16 ఆగస్టు 1946) - కలకత్తాలో హిందువులపై ఘోరహత్యాకాండ. 5000 మందికి పైగా హిందువులు చంపబడ్డారు, లక్షలాది గృహాలు ధ్వంసమయ్యాయి.



3. కాంగ్రెస్ పార్టీ తప్పులు


కాంగ్రెస్ నాయకత్వం హిందూ ప్రయోజనాల కంటే “ఐక్యత” పేరుతో రాజీ మార్గాన్నే ఎంచుకుంది.


గాంధీ - ముస్లింలను ప్రసన్నం చేసుకోవడానికి పదేపదే రాయితీలు ఇచ్చారు.


నెహ్రూ - అధికారం త్వరగా దక్కించుకోవాలనే ఆశతో మౌంట్‌బాటన్ ప్రణాళికకు అంగీకరించారు.


కేబినెట్ మిషన్ ప్లాన్ విఫలమైన తర్వాత, విభజనను అడ్డుకునే ప్రయత్నం బలహీనమైంది.


సర్దార్ పటేల్ - విభజనను “చివరి మార్గం” గా అంగీకరించాల్సి వచ్చింది.


4. 1946 - 47 హింసాకాండ


విభజన నిర్ణయం వెలువడకముందే, హిందువులపై పాశవిక దాడులు ప్రారంభమయ్యాయి.


నోఖాలి (బంగాళం) - లక్షలాది హిందువులు హత్య, బలవంతపు మత మార్పిడులు.


పంజాబ్ హత్యాకాండ - గృహాలు దగ్ధం, ఆలయాలు ధ్వంసం, మహిళలపై ఘోర అత్యాచారాలు.


సింధ్ - హిందూ వ్యాపారులు, పండితులపై దాడులు.


లక్షలాది ప్రజలు శరణార్థులుగా మారారు.




5. RSS పాత్ర - నిశ్శబ్ద ధైర్యం


1925లో డాక్టర్ కేశవ బాలిరామ్ హెడ్గేవార్ స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) అప్పటికి రాజకీయ అధికారంలేకపోయినా,

పార్టిషన్ సమయంలో గ్రౌండ్‌లో జీవరక్షక బలగంగా నిలిచింది.


రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రెండవ సర్ సంఘ్‌చాలక్ అయిన మాధవరావ్ సదాశివరావ్ గోల్వల్కర్‌ గారు దేశ విభజన సమయంలో కీలక పాత్ర పోషించారు. “ ప్రతి హిందువు పాకిస్థాన్ నుండి భారతదేశానికి సురక్షితంగా వచ్చేంత వరకు మీరు నిద్రపోవద్దు అని ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులతో అన్నారు.”



శరణార్థుల రక్షణ - పంజాబ్, ఢిల్లీ, బంగాళం, రాజస్థాన్ సరిహద్దుల్లో RSS స్వయంసేవకులు రాత్రింబవళ్ళు శరణార్థులను కాపాడారు.


ఆహారం, నివాసం, రక్షణ - అనాథలు, పిల్లలకు ఆశ్రయం.


మహిళల గౌరవ రక్షణ - అపహరింపబడిన మహిళలను తిరిగి వారి కుటుంబాలకు చేర్చడం.


ఈ సేవా భావమే RSS కి తర్వాత ప్రజల్లో అపార విశ్వాసాన్ని తెచ్చింది.



6. విభజన ఫలితాలు


1. భౌగోళిక నష్టం - సింధు, బలూచిస్తాన్, పంజాబ్ పశ్చిమ భాగం, బెంగాల్ తూర్పు భాగం పోయాయి.


2. శత్రు దేశం పుట్టుక - పాకిస్తాన్ రూపంలో శాశ్వత ప్రమాదం.


3. సంస్కృతిక నష్టం - శతాబ్దాల ఆలయాలు, సంస్కృతి కేంద్రాలు నాశనం.


4. మానవ నష్టం - 20 లక్షల ప్రాణాలు, 1.4 కోట్ల శరణార్థులు.


7. మనకు దక్కిన పాఠాలు


మత ఆధారంగా భూభాగం విభజన హిందువులకు ఎప్పుడూ రక్తపాతం మాత్రమే తెచ్చింది.


విదేశీ కుట్రలు, అంతర్గత ద్రోహం కలిసినప్పుడు నాగరికత ముక్కలు అవుతుంది.


సామాజిక ఐక్యత, ధర్మరక్షణ ఇవే భవిష్యత్తులో మన కవచం.


ముగింపు:

అఖండ భారత్ విభజన ఒక రాజకీయ సంఘటన కాదు అది ఒక సజీవ నాగరికత హత్య.

ఈ గాయం మన జ్ఞాపకంలో శాశ్వతంగా ఉండాలి.

RSS వంటి సంస్థలు చూపిన ధైర్యం, సేవా భావం మనకు పాఠం.

ధర్మం, భూభాగం, సంస్కృతి ఇవి కాపాడటం మన తరం కర్తవ్యం.


Comments